#92యేసు శరణు
Author: చెట్టి భానుమూర్తిCategory: సాయంతనారాధన
ప
యేసు పదాంబుజ శరణం – నర – దోష మహాంబుధి – హరణం
యేసే మార్గము యేసే సత్యము – యేసే జీవము యేసునకు – శరణం ||
1.
దేవకుమార శరణం – నర – జీవప్రదాత – శరణం – దేవదేవ జగదావతారము – బ్రోవరావే ప్రభు నీవే శరణం ||
2.
పాపవినాశక శరణం – నర శాపవిమోచక – శరణం – పావనాత్మ భవదీయ ప్రాణమిడి – ప్రాపువైతివో ప్రభువా-శరణం ||
3.
పరమపురుషుడా శరణం – ఓ – నిరుపమప్రేముడా – శరణం – మరణమొంది మరి మృత్యుంజయుడై – పరమున జరిగిన ప్రభువా-శరణం ||
4.
నీతిపూర్ణమా శరణం – జగజ్జ్యోతి రత్నమా – శరణం – జాతిభేదరహితుడ హితుడా – నీతిప్రబోధక నీవే-శరణం ||
5.
తేజోమూర్తికి శరణం – విబ్రాజిత కీర్తికి – శరణం – రాజరాజ యో భారత రాజ్య – ప్రజాత్మ రక్షక ప్రభువా – శరణం ||