FaithWalk
← Back to Library

#93యేసు దీనదయాళుడు

Author: చెట్టి భానుమూర్తిCategory: సాయంతనారాధన
ప
దేవాత్మజాయో దీనదయాళో పావనాత్మ – మము బ్రోచితహో – నీవే గదా మా – నిజరక్షణకై జీవమాయ ధర – జేరితహో ||
1.
సుగుణాత్ములలో – సుగుణము నీవే నిగమము లెరుగని – నీతివహో – సుజనాత్ములకు ల – సుజ్ఞానాత్మవు – సవినయ భక్తికి సారమహో ||
2.
పేదలలో నిరు – పేదవు నీవే సాధులలో ఘన – సాధువహో – మోదములర మా – ముక్తిని గూర్చిన సాధు పేదజన సోదరహో ||
3.
దీనాత్ములలో – దీనుడవై భవదీయ దయారస – ధారలహో – దినదిన మొసగిన – దేవాత్మజ ఇమ్మానుయేలు వం – దనములహో ||
4.
పరమ పూజ్యుడా – పరిమిత ప్రేమాభరితుడ సంస్థవ – పాత్రుడహో – నిరతము నిన్నే మరక – నుతించెద నరజన గణముల – నేసడహో ||