FaithWalk
← Back to Library

#91క్రీస్తునకు స్తుతి

Author: తిరుకోవళ్లూరి స్టీవెన్Category: సాయంతనారాధన
ప
నా రక్షకా యేసునాథ ఇమ్మానుయేలు – ఘోర పాపుల పాప భార విమోచక ||నా రక్షకా||
1.
నిత్య కాలమునందు – నిజమైన దేవుని – సత్య వాక్యమై యున్న – స్వామి నిన్ను తుతియింతు ||నా రక్షకా||
2.
సర్వ లోకంబులను – సత్యవాక్యమై యుండి – నిర్వహించిన దేవుని – నిజబాహువా స్తుతింతు ||నా రక్షకా||
3.
దేవ జనులకు – సువార్త దెలుప నభిషేకంబు – పూని నొందిన దేవపుత్రుడ నుతియింతు ||నా రక్షకా||
4.
దేవ మహిమ ప్రకాశ – దీనరక్షక మాను – ష్యావతారము దాల్చి – యావదాజ్ఞల్ నెరపిన ||నా రక్షకా||
5.
పావనాద్భుతుడవై – పరమ జ్ఞానము దెల్పిన – దేవస్వభావ ముద్ర – దేదీప్యుడా స్తుతింతు ||నా రక్షకా||
6.
పాపాత్ములను గావ – శాపభారము క్రింద – నోపికతో నిల్చి – ప్రాపు జూపిన ప్రభువా ||నా రక్షకా||
7.
ఈ వసుధను ప్రేమ – నెసగునట్లుగ జూపి – చావు గెలిచిన సర్వ సామర్థ్యుడా స్తుతింతు ||నా రక్షకా||
8.
ఘన దేవుని కుడి పార్శ్వమున – గూర్చుండి విజ్ఞప్తి – నొనరించు నా యేసు – వినయ స్తోత్రాంజలిగో ||నా రక్షకా||