#9స్తుతి గీతము
Author: చెట్టి భానుమూర్తిComposer/Ragam: శంకరాభరణముCategory: దైవారాధన — దైవస్తుతి
ప
ప్రబలముగానే ప్రస్తుతించెద
ప్రభుని కృపలన్ని
ప్రతి దినము నిన్ను ప్రచురపరచెద
ప్రభుడ నా విభుడా ॥ప్రబలముగా॥
1.
పొందు గోరి నా యందు నిలిచిన
బంధు మిత్రుడవు మందమతి
కానందమొసగిన మహిమతేజుడవు ॥ప్రబలముగా॥
2.
చింత దీర్చి నా భ్రాంతి మార్చితి
వెంత వింతదియో స్వాంతమున
కడు శాంతి గూర్చితి వెంత కరుణదియో ॥ప్రబలముగా॥
3.
నీతి గరపిన జాతి మరపిన
ఖ్యాతి యేసునిదే
నీరసుడ నన్ను గారవించిన నీతిరాజుడే ॥ప్రబలముగా॥
4.
జీవమిచ్చిన జావమిచ్చిన
దేవ సుతుడ నీవే
జీవదాయక బ్రోవరా ఇక జా లమేలనురా ॥ప్రబలముగా॥
5.
నిమిష నిమిషము నిన్ను భజియించెద
నెమ్మనంబునను శమదమాది
సుగుణ శోభిత సమ్మతిని నిమ్మా ॥ప్రబలముగా॥