#10దేవుని ప్రేమ
Author: UnknownComposer/Ragam: జంఝూటిCategory: దైవారాధన — దైవస్తుతి
ప
ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా
దేవుండంత గొప్ప ప్రేమయై వెలుగుచుండునే ॥ఎంత॥
1.
ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివియా
దాని నింత యంతయని వచించు మనుజుడెవ్వడు ॥ఎంత॥
2.
మనమున దలపోయ నూహకంద దెంతయున్
దాని జనువుగ జగమందు బొగడ మాటలందవే ॥ఎంత॥
3.
దేవదూతలైన దాని బాడలేరట
ఇంక దేవుడే తన సుతునొసంగె ఇంత యది యనెన్ ॥ఎంత॥
4.
ఇంత గొప్ప ప్రేమ జూప నూరకుందునే
ప్రభు జంతు జేరి సంతతంబు ప్రీతి జేసెదన్ ॥ఎంత॥