#77రక్షకునియందలి విజయము
Author: అలార్రి పెద్ద వీరాస్వామిCategory: సాయంతనారాధన
ప
విజయ గీతముల్ పాడుడి – క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడుడి
మృతిని అంతట మీటిన – విజయమిచ్చెడు దేవుని – నిజకుమారుని
నామమునన్ – హృదయములతో – భజన చేయుచు నిత్యమునన్ ||విజయ||
1.
మంగళముగ యేసుడే – మనకు రక్షణ – శృంగమై మరి నిలిచెను – నింగిన్ విడిచి వచ్చెను –
శత్రుని యుద్ధ – రంగమందున గెలిచెను – రంగము మార్చగదన – రక్త బలము వలనన్
– పొంగు నణచగ జేసెను – సాతానుని బల్ – క్రుంగ నలిపి చీల్చెను ||విజయ||
2.
పాపముల్ దొలగించెను – మనలను తన స్వ – రూపంబునకు మార్చెను – శాపంబంతయు
నోర్చెను – దేవుని న్యాయ – కోపమునన్ భరించెను – పాప
మెరుగని యేసు – పాపమై మనకొరకు – పాపయాగము తీర్చెను – దేవుని
నీతిన్ – నిపుణడై నెరవేర్చెను ||విజయ||
3.
సిలువ మరణము నొందియు – మనలను తనకై – గెలువను లేచిన వానికి – చెలు
వుగను విమలాత్ముని – ప్రేమను మనలో – నిలువను చేసిన వానికి
కొలువు చేతుము గాని – ఇలను మరువక వాని – సిలువ మోయు
చు నీ కృపా – రక్షణ చాల విలువ గలదని చాటుచు ||విజయ||