#78క్రీస్తు సేవా సాఫల్యత
Author: విలియం దాసన్Category: సాయంతనారాధన
ప
యేసు భజనయే మనలను ఆ సుగతికిని
దీయు – జనులారా దాసజనులు చేయు పనులు – దోషములు మోయు ||యేసు||
1.
మేలైన కుల శీల వ్రత – జాతి లాధిక మేల
చాల మన మీలాగున – గాలావధిగా ||యేసు||
2.
అక్షయ కరుణేక్ష భువన – రక్షణ ఖల
శిక్షాధ్యక్ష బుధ పక్ష కృత – మోక్షాయను దీక్షనన్ ||యేసు||
3.
మాటికి మిన్నేటికి బో – నేటికి గాల్ నొవ్వ – సూటిగ నరకోటి దురిత – వాటములను మీట ||యేసు||
4.
శ్రోత్రము అయి పవిత్ర నర చ – రిత్రలు వినబోక – మైత్రిని పరమాత్ముని కథ – మాత్రము విను మనుచునన్ ||యేసు||
5.
మన జీవనమునకు మారుగ – తన ప్రాణము ఇచ్చెన్ – తన రక్తముచే భావన మొనరించెను మనలన్ ||యేసు||