#76క్రీస్తు యేసునకు మంగళహారతి
Author: సి. రవివర్మCategory: సాయంతనారాధన
ప
క్రీస్తు యేసునకు మంగళం మా – కీర్తి రాజునకు మంగళం
క్రీస్తు యేసు దైవమంచును – కూడి పాడుదము మంగళం ||క్రీస్తు||
1.
ప్రవచనంబులు పల్కినట్టి – ప్రాణనాథుడవీ వె నీదు స్తవము చేయుచు
మెలగు మనుజుల – సత్ప్రభువుకిదే మంగళం ||క్రీస్తు||
2.
జగమునేలెడు జీవనాథుడు – జపములందెడు గృహ ప్రకటాక్షుడు
అగణితంబగు ప్రేమజూపిన – అమృతేజుడు మంగళం ||క్రీస్తు||
3.
ఖలుల బ్రోచెడు కనికరాత్మ – కేంద్ర స్థానము నీ
పదాబ్జము కలుషమును కడిగి మార్చినట్టి – సిలువ నాథుడే మంగళం ||క్రీస్తు||
4.
మనము గోరెడు మా హృదీశుడు – మార్గదర్శియు నీవేగావు
అనయమును నిను గొల్చు జనుల – ఆది దేవుడు మంగళం ||క్రీస్తు||
5.
జనకసుత శుద్ధాత్మ దేవుడు – గనని వినని ప్రేమ
పూర్ణుడు తనివితీరగ పాడుదము ఈ – ధాత్రి నీకగు మంగళం ||క్రీస్తు||