#764ఆ.....ఆ......ఆ..... నా హృదయం స్థిరమాయె స్తుతి గానము నే చేసెదను నా ఆత్మయు స్థిరమాయె ప్రభు యేసుని నే పాడెదను ||నా||
Author: UnknownCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
ఆ.....ఆ......ఆ.....
నా హృదయము స్థిరమాయె స్తుతిగానము నే చేసెదను
నా ఆత్మయు స్థిరమాయె – ప్రభు
యేసుని నే పాడెదను ||నా||
1.
నీ కృప ఎంతో ఎత్తైనది నీ సత్యం బుద్ధి ఘనమైనది నీ
కృపలో, నింపగ నన్ను సరి చేయుము నా జీవితము ||2|| ||నా హృదయము||
2.
వ్యధలెన్నో నన్ను చుట్టినను తుదకు మరణమే
చేరినను విడువను ప్రభువా, నీ సన్నిధిని విడనాడను నీ పెన్నిధిని ||2|| ||నా హృదయము||