FaithWalk
← Back to Library

#762శరణం శరణం నా ప్రియ యేసు చేరితి నీ దరిని నా దేవా ||శరణం||

Author: వెరి. రెవ. జి.ఎస్. సువర్ణరాజుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
శరణం శరణం నా ప్రియ యేసు చేరితి నీ దరిని నా దేవా ||శరణం||
1.
ఎన్నో అపరాధము లొనరించితి కన్నులే కానక చరియించితి మన్నించుటకు పాత్రుడను కాను కనికరపూర్ణుడా కృపనే చూపుమా ||శరణం||
2.
చెడుగులతో జత చేసితీని అడుగులు తడబడ నడియాడితిని ఇడుముల పాలై పతనము నొందితి కడకే నా దరి శరణని చేరితి ||శరణం||
3.
రక్షణ నొసగి పావన పరచి అక్షయ భాగ్యము నొసగితివి మోక్షపదమ్మున నన్ను నడిపితివి రక్షకుడా గైకొనుమా వందనం ||శరణం||
4.
నమ్మితి నయ్య నీ చరణంబుల నెమ్మది నొసగుము నా మదికి నమ్మిన వారికి ఆదరమిచ్చెడి సమ్మతుడా నా సద్గుణాల విభుడా ||శరణం||