#761యేసుని స్తోత్ర గీతం కలసి పాడుదమా సంపూర్ణ జీవితమునకు సాగిపోవుదమా సంఘమా ముందుకు సాగుదమా జీవిత యాత్రాలో దేవుని సేవలో
Author: రెవ. జి.రాజరత్నంCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
శ్రీ యేసుని స్తోత్ర గీతం కలసి
పాడుదమా సంపూర్ణ జీవితమునకు సాగిపోవుదమా సంఘమా ముందరకు సాగుమా
జీవిత యాత్రలో దేవుని సేవలో
1.
అపొస్తలుల జీవితం హతసాక్షుల అనుభవం
కావాలి జీవిత ఆదర్శము
కలిగి యుండాలి స్థిర విశ్వాసము
యేసువైపు చూచుచు సిలువ భారం మోయుచు
సాగించు నీ యాత్రిక పయనము ||సంఘమా||
2.
ఇంటింట ప్రార్థన – ప్రతి
సంఘారాధన మరవవద్దు ప్రభు సంస్కారము
కలసి ధ్యానించు దేవుని వాక్యము
అవయవాలు ఎన్నివున్నా ఒక్కటే శరీరం
సాగించు సమసమాజ జీవనం ||సంఘమా||
3.
కపట సాక్షులు ఎందరో
క్రీస్తు దేవుడు కాడని
పలుకు తియ్యని తేనె బోధలు నమ్మకు
పూర్వనమ్మిక నుండి ఎన్నడూ తొలగకు
ప్రాథమిక పాఠాలతోనే కాలమంత గడపకు
సాగించు ప్రగతి పథమున జీవితం ||సంఘమా||
4.
క్రియలు లేని నమ్మిక సాగించకు
ఇక పొరుగువాని ప్రేమించు నీవలె
శత్రువులను మన్నించు ప్రభువువలె
అవసరములో ఉన్నవాని ఆదుకొనుటయే న్యాయము
సాగించు ఈ ధర్మ కార్యంబు ||సంఘమా||
5.
ప్రభుని వార్త ప్రకటన ప్రజల కొరకై నివేదన నీ ధ్యేయము
కావాలి సంఘమా
ఈ భారం నీదే గమనించుమా
త్రియేక దైవం అందించు సాయం
సాగించు ప్రభుని వార్త మహోద్యమము ||సంఘమా||