#756సమృద్ధి జీవము క్రీస్తుని లో పొందుడి ప్రియులారా ప్రవహించుచున్నది జీవ నది త్రాగుడి ప్రభు పేర యేసే నిత్య జీవము యేసే జీవ మార్గము యేసే నిజదైవము నమ్మినవారికి పరలోకము
Author: రెవ. జి.రాజరత్నంCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
సమృద్ధి జీవము క్రీస్తుని లో పొందుడి ప్రియు
లారా ప్రవహించుచున్నది జీవ నది త్రాగండి ప్రభు పేర
యేసే నిత్య జీవము యేసే జీవ మార్గము
యేసే నిజదైవము నమ్మినవారికి పరలోకము
1.
జీవుల కన్నులు ప్రభువైపు – చూచుచూ ఆహారము
కొరకై
ప్రేమతో దయచేయును ప్రభువు – కోరిన వరములను
2.
జీవన ఊటలు హృదయములో –
ప్రవహింపజేయును ప్రభు యేసు జీవన దాత మన చెంత – జీవితకాలమంత
3.
ఎండిన ఎముకలు బ్రతికెగదా –
నిండుగ జీవ శరీరముతో
లేచిరి మృతులు ప్రభు
పిలువ – జీవన సాక్షులుగా
4.
మరణమే మరణం
చెందెను చూడు – సిలువలో యేసుని మరణముతో
లేతురు మృతులు ఒక దినము
– మహిమ శరీరముతో
5.
క్రీస్తు శరీర సహజములలో –
క్రీస్తులో పోలి నడిచెదము
ప్రభు భోజన సంస్కారములో
– జీవము పొందెదము