#755అద్భుతమైన నీ కృపలో మమ్ము మలచుము ఓ ప్రభువా అనంతమైన నీ కృపలో మమ్ము మార్చుము ప్రభువా మమ్ము మార్చుము
Author: రెవ. జి.ఎస్. సువర్ణరాజుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
అద్భుతమైన నీ కృపలో మమ్మును మలచుము ఓ ప్రభూ
అనంతమైన నీ కృపలో మమ్మును మార్చుము ప్రభూ
మమ్మును మార్చుము
1.
ఎన్నో అపరాధముల నెరిగి చేస్తిము ఇచ్ఛవచ్చిన మార్గము తొలగి తిరిగితిమి
కానరాని క్రియలెన్నో చేసి
మనసున శాంతి లేదాయెను ||అద్భుత||
2.
స్వనీతియే మా కృత నిశ్చయమాయెను సత్క్రియలే మా కాస్పదమాయెను
మతి లేని క్రియలతో మేము అలసి యుంటిమి
పతితులమై కృపన్ వేడితిమి ||అద్భుత||
3.
కల్వరిలో మా కలుషము బాపితివి సిలువలో బలియై ప్రేమను చూపితివి విలువను కూర్చి
మమతల నొసగగ
పలువిధ కృపలను ఇచ్చితివి
4.
నీ కృపయే మా భయమును తీర్చెను పాపము బాపి మా కభయము నిచ్చెను నీ కృ
పయే మా కాధారమాయెను
మా దోష భారము తొలగించెను ||అద్భుత||