#753యేసు క్రీస్తును – జీవ వాక్యమా నన్ను నడుపుమా – మోక్షపదమున ||
Author: సి.ఎ.జె.ప్రసాదరావుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
యేసు క్రీస్తును – జీవ వాక్యమా నన్ను నడుపుమా –
మోక్షపదమున ||
1.
ఆదినుండి తండ్రితో – కలసియున్న వాక్యమా పరిపూర్ణమైన –
సంతోషముంగల సహవాసమును గూర్చుమా ||
2.
లోకమునకు వెలుగై – తేజరిల్లు వాక్యమా జీవంపు వెలుగు –
ప్రసరింప జేసి కనువిప్పు కలిగింపుమా ||
3.
సత్యమైన వాక్యమా నిత్యమైన వాక్యమా
వాక్యంబు నెప్పుడు – గైకొంచు నడువ
పరిపూర్ణ స్థితి నిమ్ముమయా ||
4.
ప్రాణమే యర్పించిన – ప్రేమయైన వాక్యమా
మరణంబు నుండి – జీవంబు నొందే
పరమున్ ప్రసాదించుమా ||
5.
మంచి చెడుల నెల్లను – ఎంచి చూపు వాక్యమా వంచించు ఆత్మన్ – ఖండించి
గెలవగ పరిశుద్ధాత్మ బలమిమ్ముమయా ||
6.
సజీవమై. శక్తియై – వాడియైన వాక్యమా ప్రాణాత్మలందు – శోధించి, వెదికి
సంపూర్ణ స్థితినిమ్ముమయా ||