#752దయగల మా ప్రభువా
Author: సి.ఎ.జె.ప్రసాదరావుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
రాగము : శంకరాభరణం తా : ఆది
దయగల మా ప్రభువా
– కరునామయ యేసు భయభక్తులతో నీ మార్గములో జీవింప తోడ్పడుమా
1.
నీ వాక్యము నెల్లప్పుడు – వినువానిగనే గాక నీ వాక్యాను సారముగా – జీవింపతోడ్పడుమా ||
2.
''ప్రభువా—— యని పిలువగనే– ప్రభు రాజ్యము దొరకదు ప్రభు దేవుని
చిత్తముగా– జీవింప తోడ్పడుము ||
3.
నీ ధర్మశాస్త్రము నెల్లన్ – అనుసరింప గలవాడనై నీతిమంతుని
గా నెంచబడన్ – జీవింప తోడ్పడుమ ||
4.
నీ మాటలు పాటించి – స్థిరమగు పునాది వేయు బుద్ధి గలవాని బోలి జీవింప
తోడ్పడుమా ||
5.
ఇతరుల రక్షణ కొరకు – నిరతము కృషి సలుపుచును ఇతరుల యెడ నీ వలెనే – జీవింప తోడ్పడుమ ||