FaithWalk
← Back to Library

#751క్రీస్తులో మనమొక

Author: సి.ఎ.జె.ప్రసాదరావుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
రాగము : మిశ్రజంఝూటి తా : ఆది క్రీస్తులో మనమొక – నూతన సమాజము క్రీస్తు కలిగి నడుచుటే మన విధి ||
1.
దేవుని వాక్యము నమ్ముట వలన దేవుని వలన కలిగిన వారం దేవుని ఆత్మను పొందుట వలన దేవుని రాజ్యపు వారసులం దేవుని ప్రతినిధులం ||
2.
పాత స్వభావము విడుచుట వలన పాతాచారముల్ వదలుట వలన నూతన జన్మను నొందుట వలన నూతన సమాజపు సభ్యులము క్రీస్తు సంబంధులము ||
3.
క్రీస్తు పోలి నడుచుట వలన క్రీస్తు మనసును నొందుట వలన ఓర్పును, త్యాగము, చూపుట వలన క్రీస్తు సువార్తను చాటుటకు క్రీస్తు సేవకులం ||
4.
చీకటి నుండి వెలుగుకు మనలను పిలిచిన దేవుని గుణాతిశయములు ప్రకటన చేయగ నేర్పరచెన్ దేవుని సొత్తగు ప్రజలనుగా యాజక సమూహముగా ||