FaithWalk
← Back to Library

#750లే లెమ్ము అంతరాత్మ లేచి త్వరగా సిద్ధపడుమ

Author: సి.ఎ.జె.ప్రసాదరావుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
రా : శంకరాభరణం తా : త్రిశ్రగతి ...........లే లేమ్ము అంతరాత్మ లేచి త్వరగా సిద్ధపడుమా
1.
యేసుప్రభువు భూజనులను – తీర్పుతీర్చు తరుణమాయెనన్ కడబూరను ఊదగనే – మేఘంబుపైన ప్రభువు వచ్చున్ మోక్షంబునకో, నరకంబునకో నిర్ణయించే తీర్పు తీర్చున్ ||
2.
నిర్లక్ష్యముగా, నిర్భయముగా – ఎంతకాలము నిదురింతువు, సర్వాధికారిప్రభువగు – న్యాయాధికారి, యేసు వచ్చున్, జీవంబునకో, మరణంబునకో – నిర్ణయించే తీర్పు తీర్చున్ ||
3.
దైవభీతి, భక్తిలేక – ఎంతకాలము జీవింతువు – దైవదూతల్, జీవ గ్రంథంతెరిచి నీ క్రియలు తెలియ చదువున్ – పైకెత్తుటయో, దిగవిడుచుటయో నిర్ణయించే తీర్పు తీర్చున్ ||
4.
మరణించినన్, జీవించినన్ – ప్రతివానికి తీర్పు గలదు – దూతలతో భక్తా వారితో – ఆర్భాటముగానూ ప్రభువు వచ్చున్ – పరమ పదమో, అధోపదమో – నిర్ణయించే తీర్పు తీర్చున్ ||
5.
దేవుని గొర్రెపిల్లయై – యేసు క్రీస్తు వరుడైవచ్చున్ వధువైన క్రీస్తు సమయమున– పెండ్లాడనై ప్రభువచ్చున్, పెండ్లి విందో, త్రోయ బడుదో – निर्णयించే తీర్పు తీర్చున్ ||
6.
ఇప్పుడైన నీ పాపములను – పరిహరింపమని వేడుమ – ఇష్టుడైనను మారుమనస్సు పొందిన యెడల రక్షణ గలదు – కిరీటమో అగ్ని జ్వాలలలో – निर्णयించే తీర్పు తీర్చున్ ||