FaithWalk
← Back to Library

#749క్రీస్తు పునరాగమనము

Author: సి.ఎ.జె.ప్రసాదరావుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
క్రీస్తు పునరాగమనము ''ప్రభువు రాకడ సమీపించుచున్నది... యాకోబు 5:8
1.
నీ రాక సమీపమంచు – నేనిప్పుడు గుర్తించియుంటి నీ రాక కొరకు నా జీవితం బును సిద్ధపరచుము నా యేసు ప్రభో ||
2.
నీ రాక నిజమయ్య తండ్రి – నేడో, రేపో, మరి ఇంకెప్పుడో ఏ వేళనైనా, ఆ మర్మమును, నే – మది దలచ కృప నిమ్మో ||యేసు ప్రభో||
3.
నీ నీతి లేశంబులేక – ఎన్నెన్నో పాపాలు చేయ వెనుకాడకుంటిని, మితిమీరిపోతిని – నన్ను నిలిపి స్థిరపరచుము ||యేసు ప్రభో||
4.
నా దీపమున నూనె లేదు – నా బ్రతుకున వెలుగే లేదు సద్భక్తి నూనె శుద్ధాత్మ కాంతి – నా కొసగి వెలిగించుము ||యేసు ప్రభో||
5.
కడబూర మ్రోగెడి వేళ – మేఘములు నిన్ను మోయువేళ పరలోక వరుడా ఓ గొర్రెపిల్లా – నీ యొద్దకు నన్నెత్తుము ||యేసు ప్రభో||
6.
విశ్వాస సంఘంబులోన – నీ జీవ గ్రంథంబులోన నా చేర్చబడగ, ముద్రించబడగ – రక్తముతో ముద్రించుము ||యేసు ప్రభో||
7.
నిత్యుండ సర్వాధికారి – నీ కొరకు కనిపెట్టుచుండ మోకాళ్ళు వంచి ప్రార్థించుచుండ – నీ యాత్మను నా కొసగుమా ||యేసు ప్రభో||
8.
సర్వాంగ కవచంబు దాల్చి – వాక్యంబును ఖడ్గంబు బూని సాతాను తోడ పోరాడుచుండ – బలమిమ్ము జయమిమ్ము ||యేసు ప్రభో||
9.
నీ తీర్పు దినమందు రాజా – నీతి మంతుల సంఘమందు నేనుండ గలుగ కొనియాడగలుగ – నీతి వస్త్రము నిమ్ము ||యేసు ప్రభో||
10.
నేనన్ని సమయంబులందు – నేనన్ని కాలంబులందు నీతోడగలిసి, జీవింపగలుగ – అనుభవము కలిగింయుము ||యేసు ప్రభో||