FaithWalk
← Back to Library

#748ప్రార్థన

Author: సి.ఎ.జె.ప్రసాదరావుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
ప్రార్థన ''అడుగడి మీ కియ్యబడును. వెదకడి మీకు దొరుకును—— మత్తయి 7:7 వేచియుంటి నేనయ్యా – ఆశతోడ నీ కొరకు ||వేచి||
1.
ఆశ్రయించి అడుగువారికి – అక్కరలను తీర్చెడి ఆశ్రయంబు నీవమనుచు – అభయమిచ్చి గావున ||వేచి||
2.
పట్టుదలతో నుపవసించి ప్రార్థనలను సల్పెడి భక్తున్ దర్శించి నీదు – శక్తినిత్తు గావున ||వేచి||
3.
వ్యాకుల భావ మెరుగలేక – ఆత్మ నంపి తెలుపమనగా వాక్య భోజనంబు నిచ్చి జీవమిత్తు గావున ||వేచి||
4.
కుమిలి కుమిలి నీరసిల్లి – నలిగి విరగే గానలేక కూర్మితోడ వెదికి వెదికి – విమోచింతు గావున ||вечи||
5.
మనస్సునందు శాంతిలేక – మార్గమేమి గానలేక గాంచి బ్రోవుమను చే వేదన – శాంతి గూర్తు గావున ||వేచి||
6.
చెడ్డమనసు ప్రేరణమున – చెడ్డపనులు చేయబూన శుద్ధమనసునంపి నన్ను – అడ్డగింతు గావున ||వేచి||