FaithWalk
← Back to Library

#747రమ్ము యెహోవా రమ్ము ప్రభో

Author: సి.ఎ.జె.ప్రసాదరావుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
1.
రమ్ము యెహోవారమ్ము ప్రభో – క్రమ్ముము నాదు హృదయమును నా ప్రార్థనకు నీ చెవియొగ్గి – నా మనవి నాలకించుటకై ||రమ్ము దేవ||
2.
విరివిగ వలచి లోకమును – దరిద్రము లెన్నో చేసి భరింపరాని భారమును – హరింపజేసి రక్షంపన్ ||రమ్ము దేవ||
3.
తలచి నాదు పాపములను – తలచి వాని ఫలితములను తలంపుకే మది చెదరినది – తొలగింప నానాదు దురిత స్థితిని ||రమ్ము దేవ||
4.
కరములు చాసి పిలుచుచుండన్ – త్వరితపడి రమ్ము సహాయపడన్ మొరాలకించుము చెవియొగ్గి – బిరాన నన్ను విడిపించుటకై ||రమ్ము దేవ||
5.
నా రక్షకుండు విమోచకుడై – ఆనంద సంతోషముల నిచ్చు నా దేవుని నే చూచుటకు – నేడే యాశించుచు వేచియుంటిని ||రమ్ము దేవ||
6.
శుద్ధముగు హృదయమును – సుస్థిరమగు విశ్వాసమును నిశ్చలభక్తిని నా యందున – నూతనముగా పుట్టించుటకు ||రమ్ము దేవ||
7.
నిలిపితి నీపై నా మనసున్– నిలిపితి నీపై నమ్మికను చలింపకుండగ కాపాడున్ – పాలింప రమ్ము పరమ తండ్రి ||రమ్ము దేవ||
8.
కురిపించుము నీ యాత్మను నా పై – కురిపించుము నీ కృపను నాపై తరింప జేయుము నా తనువును – స్మరింతును నిన్ను నిరతమును ||రమ్ము దేవ||