#746అలసి సొలసి పోతిని
Author: సి.ఎ.జె.ప్రసాదరావుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
రాగము : మిశ్రనటభైరవి తాళము : త్రిశ్రగతి
అలసి సొలసి పోతిని –
సేదతీర్చవా ప్రభూ!
ప్రశాంత జీవ జలముల – త్రాగనిమ్ము నిండుగా ||
1.
దూరభారములను నేను – పారజూడ
బోవ గాలివాన సంభవించి – గుండెలోన గుబులు గలిగి ||
2.
ముందు వెనుక చూడక – చెంగు చెంగు
మంచు నెగుర గుండురాయి కాలుదగల – గుండెలోన గుబులు గలిగి ||
3.
లోతుపాతులు ఎరుగక – ఎదురుగాను ఈదబోవ
గొంతుదాక మునిగిపోవ – గుండెలోన గుబులు గలిగి ||
4.
మంచి చెడుగు లెంచక – కొంటెగాను
సంచరింప గృహంవారు రోసివేయ – గుండెలోన గుబులు గలిగి ||
5.
కీడు మేలు లందున – మేలు మార్గ
ముందు బోవక కీడు సంభవించగానే – గుండెలోన గుబులు గలిగి ||
6.
జీవమరణమందలి – జీవమే మొగనలేక
మరణమెదురు పడిన వేళ – గుండెలోన గుబులు గలిగి ||