FaithWalk
← Back to Library

#745పశ్చాత్తాపము

Author: సి.ఎ.జె.ప్రసాదరావుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
పశ్చాత్తాపము ''ఇకమీదట నీ కుమారుడననిపించు కొనుటకు యోగ్యుడను కాననెను—— లూకా 15:21 నిను తండ్రి యని బిలువ నేనెటు గాన దో దేవా ! నిను రానీయక హృదయమును మూసికొంటిన్ – పనికి మాలిన మార్గమున నడుచుకుంటి
1.
నోటితోడనే నిన్నొప్పుకొనుచుంటిన్ – మాటలోనే కాని మదిలోన లేదు – పాటింపకుంటికన్ బ్రతుకులోనయ్యో ||
2.
నిన్ను వలె పొరుగువానిని – సరిగా నెంచ – మన్న యాజ్ఞను నేను మన్నించలేదు– అన్నీ నాకే కావాలె ననుకుంటుంటి నయ్యా ||
3.
నీ వాక్య పఠనంబు నీ నామధ్యానం – బేవేళ నామదికి వెగటుగదోచె నీవాక్యము నా చెవులు వినవాయెనయ్యో ||
4.
పరిశుద్ధుల సహవాస భావమే లేదు ఇరుగు పొరుగుల చెలిమి ఇసుమంత లేదు– పరుల దూరము బెట్టి పరువంటినయ్యో ||
5.
సాతాను వలలోబడి చెలరాయించలేక – ఏతావుగానలేక నిలువైతి నకటా – నా తండ్రి యిక దిక్కు నాకెవరులేరే ||
6.
నిన్ను నమ్ముకొంటినిక నీవాడనౌదు – నన్ను ముట్టి, లేపి జ్ఞానము, జీవ మిచ్చి – మనస్సును, హృదయమును మార్చుము దేవా