#744పశ్చాత్తాపము
Author: సి.ఎ.జె.ప్రసాదరావుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
పశ్చాత్తాపము
నీ చెడుతనమును మానక కొని మారుమనస్సు నొంది
ప్రభువును వేడుకొనుము అకార్య. 8:22
యేసు ప్రభూ! నేనింతకాలము వృథాచేసితి, నా జీవిత
మంతటినన్ –
అయ్యయ్యయ్యో ||యేసు||
1.
నాయేష్టమే – నా సౌఖ్యమే – నా సొగసే – నా స్నే హమే
ఇవియే నాకే – ఘనమంటిని – అయ్యో , మూర్ఖుడనైతి
2.
నీ వొసగిన – దేహంబును – నీవరములను – నీజ్ఞానమును
నీ సేవకై – వాడనైతి – ప్రభువా – మన్నింపుమా
3.
నీవు గాక – వేరెవరు – దిక్కే నాకు – లేరంచును ఇప్పుడు
నేను – గ్రహింయుంటిని – ప్రభువా – గ్రహియుంటిని
4.
నీ శ్రమలే – నీ సిలువె – నీ రక్తమే – నీ త్యాగమే
ఇవియే నాకు – శరణ్యము – ప్రభువా – రక్ష్యణ్యము
5.
చాలునిక – లోకాశలు – చాలునిక నా యిష్టము
ఇప్పుడు నేనీవెంట వచ్చుదున్ ప్రభువా
చేర్చుకొనుమా ||