#743కృతజ్ఞతాస్తుతి
Author: సి.ఎ.జె.ప్రసాదరావుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
కృతజ్ఞతాస్తుతి
దేవ యెహోవ – ప్రేమ స్వరూప – జీవ ప్రదాత ప్రభో ||
1.
దినదినమున నన్నెనరుతో గాకెడి – ఘనుడవు నీవే గదా
గానము చేసెద ననిశము నిన్ను – ఘనత మహిమ కలుగ ||దేవ||
2.
సుందరముగు భూమ్యాకాశంబుల – చంద్రుదు మదినెంచనందలి సూర్యుని, చం
ద్రుని, చుక్కల – అందము నే గాంతును ||దేవ||
3.
గాలిని నీటిని సూర్యుని రశ్మిని – పూలను ఫలములను
మేలుల గూర్చగ సృజియించిన నీ – జాలిని స్మరింతును ||దేవ||
4.
ప్రేమించుటకై తల్లిదండ్రులను – ప్రియమగు గృహములను ఇమ్ముగ భోజనపానాదు
లను – కూర్మిని గూర్చితివి ||దేవ||
5.
పాపపు కూపములోనికి జారి – నా పోవుచు కేసి నేనుండగ – ప్రాపుగ యేసునికాపుగ
నిచ్చిన – కృపకై వందనములు ||దేవ||
6.
జనక సుతాత్మ త్రియేకుడు దేవ – ఆనయము స్తుతి మహిమ ఘన ముగ నీకు
యుగ యుగములను కలుగునుగాక ఆమెన్ ||దేవ||