FaithWalk
← Back to Library

#75క్రీస్తుకు మంగళ స్తోత్రము

Author: పురుషోత్తమ చౌదరిCategory: సాయంతనారాధన
ప
మంగళంబని పాడరే – క్రీస్తుకు జయ మంగళంబని పాడరే యేసుకు జయ మంగళంబని పాడరే – మంగళంబని పాడి సజ్జనాంగ పూజితుడై కృపాతరంగి లోక సమూహ పాపవిభంగుడనియు పొంగి జయజయ || మంగళం ||
1.
సోదరాలి భంగిని భక్తుల నెల్ల నెరి బ్రోచెడి వానిని యూద దేశపు వారలధిక బాధలు బెట్టుచు హింసజేసిన సాదరంబున త్రిదినములకు ముదముతో గనపడిన ప్రభునకు || మంగళం ||
2.
ధరణి నొల్లినట్టి దాసజనములను బ్రోచు దైవ తనయుడని నిజ మరియు నిలను స్మరించువారికి గురుతరంబగు కలుష జలనిధి దరికి జేర్చు పరమ పదమే యిరువొనర్చెద ననిన ప్రభునకు || మంగళం ||