#74క్రీస్తునకు మంగళార్చన
Author: పురుషోత్తమ చౌదరిCategory: సాయంతనారాధన
ప
వందనమే యేసునకు – వరుస గుణోదారునకు
సౌందర్య ప్రభువునకు సర్వేశ్వరా నీకు || వందనమే ||
1.
యెహోవా తనయునకు – ఇమ్మానుయేలునకు
బహు కరుణాభరణునకు – ప్రభువుల ప్రభువునకు || వందనమే ||
2.
ఆశ్రిత జనపాలునకు – నఖిల కలుష దహనునకు
ఇశ్రాయేలు రాజునకు యెహోవా నీకు || వందనమే ||
3.
మరియా తనయునకు – మహిమ గంభీరునకు
పరిశుద్ధాచరణునకు – పరమేశ్వరా నీకు || వందనమే ||
4.
రాజులపై రాజునకు – రవికోటి తేజునకు
పూజార్హ పదాబ్జునకు – భువనావన నీకు || వందనమే ||
5.
ప్రేమ దయాసింధునకు – క్షేమామృత పూర్ణునకు
ఆమెనని సాష్టాంగము – అర్పింతుము నీకు || వందనమే ||