FaithWalk
← Back to Library

#73క్రీస్తునకు స్తోత్రము

Author: పురుషోత్తమ చౌదరిCategory: సాయంతనారాధన
ప
మంగళమే యేసునకు – మనుజావతారునకు శృంగార ప్రభువునకు – క్షేమాధిపతికి || మంగళమే ||
1.
పరమ పవిత్రునకు – వరదివ్య తేజునకు నిరుపమానందునకు – నిపుణ వైద్యునకు || మంగళమే ||
2.
దురిత సంహారునకు – వరసుగుణోదారునకు కరుణా సంపన్నునకు – జ్ఞానదీప్తునకు || మంగళమే ||
3.
సత్య ప్రవర్తనునకు – సద్ధర్మశీలునకు నిత్యస్వయంజీవునకు – నిర్మలాత్మునకు || మంగళమే ||
4.
యుక్తస్తోత్రార్హునకు – భక్త రక్షామణికి సత్యపరంజ్యోతి యగు – సార్వభౌమునకు || మంగళమే ||
5.
నరఘోర కలుషముల – నూరుమార్గాన నిల కరుదెంచిన మాపాలి – వర రక్షకునకు || మంగళమే ||
6.
పరమపురి వాసునకు – నరదైవ రూపునకు పరమేశ్వర తనయునకు – ప్రణతింతుము నిన్ను || మంగళమే ||