FaithWalk
← Back to Library

#72క్రీస్తునకు మంగళార్చన

Author: పురుషోత్తమ చౌదరిCategory: సాయంతనారాధన
ప
మంగళము పాడరే – క్రీస్తుకు జయ మంగళము పాడరే యో ప్రియులారా – మంగళము పాడరే మంగళము పాడెదము సద్గతిని వీడి ప్రభు – సంగములను గూడి మది బొంగుచు జెలంగుచును || మంగళము ||
1.
రాజులకు రాజని – దూతలచే పూజగొనువాడని తేజమున సూర్యునికి – దీప్తి నిడు సద్గుణ విరాజితుని సాధుజన రక్షకుని పక్షముగ || మంగళము ||
2.
కరుణ గలవాడని – పాపుల బ్రోచు బిరుదుగొనినాడని మరణమును దాని బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుడతడె మన పాలి వాడని శుభ || మంగళము ||
3.
సంగీతము పాడుచు – సువార్త ప్రసంగములను గూడుచు నింగికిని భూమికిని – నిత్యముగ నేల దగు శృంగారపు రాజునకు క్షేమమగు ఆమెనని || మంగళము ||