#71క్రీస్తును స్తుతించుట
Author: UnknownCategory: సాయంతనారాధన
ప
నీవు నా దేవుండవై యున్నావు యేసు నాథా –
నీవలన బ్రోవవే నన్ను గావవే || నీవు ||
1.
పాప మానవ శాప భారము – నోపి సిలువను బడిన క్షేమాధిపతి సర్వ భూపతి || నీవు ||
2.
శ్రేయమౌ కాయంబు భక్తుల – కీయ సిద్ధము చేయు యేసు నాయకా మోక్ష దాయకా || నీవు ||
3.
జీవ మార్గెడి త్రోవ నే బడి – చావనై యున్నాను పతిత పావనా యాత్మ జీవనా || నీవు ||
4.
జాగుచేయక బాగుచేయను – రాగదె నే ఘోర పాప రోగిని దుఃఖ భాగీని || నీవు ||
5.
పాపమున నా రూపము మాపి – ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా కృపను చూపవా || నీవు ||