#731నీ నీడలో
Author: రెవ. బి. హెన్రీCategory: రెండవ అనుబంధము
ప
రాగము : బాగేశ్వరి తాళము - ఆది తాళము
నీ నీడలో – బ్రతుకు సాగాలని నీ బాటలో – నేను – నడవాలని
ప్రభూ – నా జీవితాశ – నెరవేరునా – నెరవేరునా
1.
మతిలేక బ్రతికాను – గతిలేని బ్రతుకు క్షతిలారని
వెతలన్ని – సంప్రాప్తమాయె హితమైన నీ వాక్య – భోజంబులోనే
హితుడా నీ ప్రేమ – రుచి చూచినాను ||నీ నీడలో||
2.
బాంధవ్యములను లోక – బంధములలోనే
బందీగ ఉన్నాను – పొందాను వ్యధను
బలియైన అలనాటి – నీ ప్రేమ జూసి
బరువాయె మనసంత – శరణంటి నిన్ను ||నీ నీడలో||
3.
కన్నాను నీప్రేమ – కల్వరిలోనే విన్నాను నీ బోధ
– వేదంబులోనే
నన్నాదుకొనువారు – విశ్వాసము లేరు
ఉన్నావు నీవే – విమోచింప నన్ను ||నీ నీడలో||