#730ఓ దేవా నేను నీ దాపున
Author: రెవ. జి.టి. మార్కుComposer/Ragam: ఛాయ: ఓ దేవ నేను నీ దాపునCategory: రెండవ అనుబంధము
ప
శ్రీ యేసు నీ పాద – సేవ చేయుట ఎంతో శ్రేయంబు చేకూర్చును
నా యేసు నీ పాద సేవ చేయుటచే
నా ఆయాసములన్నియును – అంతరించును ప్రభువా
1.
ఘోర పాపిని నేను – నేరంబులను చేసి
దారి తప్పిన ద్రోహిని – కారుణ్యమయుడవే
కరుణించి కాపాడి – దారిలో నన్నుంచి
దరి చేర్చుము తండ్రి ||శ్రీ యేసు||
2.
దోషకారిని నేను – దోషంబులచేసి
దోసిలొగ్గితి ప్రభువా – దాసుండనో యేసు
నాథా నీ దయచేత – దోషంబులనుబాప
దాసునిగ జేకొనుము ||శ్రీ యేసు||
3.
సాతాను శక్తులను – సంధించి జయముంది
సంతరిల్లిన యేసువా – నీతోనే నేనుండి
నిన్నే సేవించెద – సాతాను నోడించి
శక్తి నియ్యుము ప్రభువా ||శ్రీ యేసు||
4.
అలనాడు శిష్యులను ఆదరించియు నెంతో అభయమిచ్చిన యేసువా – ఇల నే దీనుడనయ్య
అలముకొని యున్నట్టి – కలుష భారములెల్ల
తొలగజేయుము తండ్రి ||శ్రీ యేసు||
5.
నాదు జీవితమెల్ల – నీదు సేవకే నేను
ధారవోయుదు నా ప్రభువా
నాథా నా రక్షకా నా సర్వస్వము నీవే
నీ పాద సేవయే – నా జీవితాశయము ||శ్రీ యేసు||
6.
నీ కొరకే జీవించి – నిన్ను సేవించుచు
నీకొరకే మరణింతును – నీకే నా యాత్మను నిజమొప్ప నర్పించి నీ సన్నిధిలో నేను
నిత్యముందును ప్రభువా ||శ్రీ యేసు||
7.
ఇదియే నా తుదియాశ – ఇదియే నా తుది కోరిక
ఇదియే నా తుది ఆశయము – హృదయంబు నీ కిత్తు పదిలంబుగా నేను – సదయుండా
నిరంతంబు అందు నివసింపుము ||శ్రీ యేసు||