#729యవ్వన సమాజం సవాలు
Author: బోండ్ల సైమన్Composer/Ragam: ఛాయ : రాజాధి రాజ రారాCategory: రెండవ అనుబంధము
ప
యౌవన సమాజము సవాలు
రారండీ – యువతి – యువకులారా – లేలండీ సిలువదారిపోవ రారాజు – యేసురాజు రాజ్యం – రయముగానూ – వచ్చునంచు చాట ||రారండి||
1.
ఓ............మారుతున్న నేటి – సమాజంబులో – ఓ ...మారనట్టి యేసు శక్తి
చూపను మార్పుమనస్సు పొంది నీవు వేగ – మార్గ
దర్శి యేసు దారిపోవ – మానవాళి – మనస్సు వల్ల
మార్చి – మంచి సమాజంబును – నిర్మింపన్ ||రారండి||
2.
ఓ.......ప్రేమ లేని – నేటి సంఘజీవికి – ఓ ....ప్రేమమూర్తి – యేసు
ప్రేమ చూపుచు ప్రేమ శ్రేష్ఠమైనదంచు చాటి – ప్రేమ దారి
యెల్లరకును చూపి– ప్రేమధార గ్రోలి నీవు వేగ –
ప్రేమధార – గ్రోలుడంచు
చాట ||రారండి||
3.
ఓ.......రక్షణంపు – మార్గమేమో తెలియక –
ఓ .......పాప రోగగ్రస్తులైన – పాపులన్ పరమ
వైద్యుడేసు చెంతకేగ – పాప రోగమెల్ల – పోవునంచు –
భక్తితోడ – చాటి
చెప్పి నీవు – ముక్తి దారి– చూపవేగ రండి ||రారండి||
4.
О........శాంతి – క్రాంతి లేని – లోకవాసికి – ఓ .....శాంతి – క్రాంతి యేసనంచు – చాటుచు భ్రాంతిలోకమందు ప్రీతి వీడ విశ్రాంతి నిచ్చు విశ్వనాథుడంచు – క్రాంతి హృదయమందు నింపి నీవు –
నిశాంతమందు
– తుదకు చేరవేగ ||రారండి||
5.
ఓ........నూతన – శతాబ్ద – నడుగుపెట్టిన – ఓ .....నవత – యువత – నూతనోత్సవముతో – దివ్యయేసు – రక్షణంపు – వార్తన్ – నవ్యపద్ధతులతో– నీవు చాటన్ – నిదురబోవు – లోక వాసులన్ – నిదురలేపి – మేలుకొలుపు
పాడన్ ||రారండి||