FaithWalk
← Back to Library

#728షష్టిపూర్తి ఉత్సవము

Author: బోండ్ల సైమన్Composer/Ragam: రాగము : బిలహరి తాళం - త్రిపుటCategory: రెండవ అనుబంధము
ప
షష్టిపూర్తి ఉత్సవము సృష్టి కర్త – స్తోత్రములు జేతు – ఈ షష్టిపూర్తి పర్వదినమున చేరి పూజింతు సృష్టిములతో ఈ మానవుని నీ స్వరూపము – నీ పోలికతో – సృజనాత్మకతతో – నీవే సృజియించి నీ సృష్టిపైన పాలన అభివృద్ధి – లొసగితివి – నీ కృపల – దలచుచు ||సృష్టి||
1.
గర్భవాసిని – యైనది – మొదలు – గర్భమందు – పెంచిన దేవా గర్భమందే – నన్ను యెరిగితివి – నా తల్లి గర్భము – నందే నన్ను ప్రతిష్ఠ చేస్తివి – నీ కృపల దలచుచు ||సృష్టి||
2.
శైశవ – బాల్య – యౌవనములు – వైవాహిక – జీవితము నొసగి భార్యభర్తల – బంధమును వేసి – భవ బంధములు గల – బిడ్డలను – దానముగా – నొసగితివి – నీ కృపల దలచుచు ||సృష్టి||
3.
విద్యాబుద్ధులు – బల సౌఖ్యములు – మధ్య గొర్రెపిల్ల రక్షణ – మధ్యాకాశ – మార్గములు తెలిపి – ఈ వ్యర్థలోకపు – వ్యర్థ జీవిత మార్గములు విడువక – నీ కృపల – దలచుచు ||సృష్టి||
4.
ఆయు – రారోగ్యముల నిచ్చి – హాయి – ఆనందంబుల నిచ్చి అన్ని సుఖభోగంబులిచ్చితివి – ఈ అవనియందు – అన్ని ఆశిస్సులు – నొసగితివి – నీ కృపల – దలచుచు ||సృష్టి||
5.
మానవుని – ఆయుష్కాలంబు – మాయమౌ – ఆవిరివంటిది యౌ – మరుక్షణము – మటు – మాయమౌ పోవు – మానవుని జీవం – పరమపురమున – ప్రభుతో నుండుటకు – నీ కృపలదలచుచు ||సృష్టి||
6.
కష్టకాలములలో – కర్తగా – కాచి బ్రోచిన – కన్నతండ్రి – నష్టములు కలిగిననూ – నిలిపితివి – నా బ్రతుకు బాటలో – తోడు నీడై – కాచి బ్రోచితివి ||సృష్టి||
7.
శేషకాలపు శ్రేష్ఠత లెరిగి – స్వామి యేసుని సేవలు చేయను అంకితంబు జేతు నా బ్రతుకు – ప్రభు సేవ కొరకు – కట్ట కడవరి – శ్వాస మటునంతకు – ఆ కృపల దలచుచు ||సృష్టి||