FaithWalk
← Back to Library

#727వివాహ వార్షిక దినము

Author: బోండ్ల సైమన్Composer/Ragam: రాగము : ముఖారి తాళం - త్రిపుటCategory: రెండవ అనుబంధము
ప
వివాహ వార్షిక దినము దేవా – దీవించుమా దంపతులను – దయతో – నీవు దీవించు మెల్లప్పుడు
1.
పెండ్లి – అయినది – మొదలు – పలు దీవెనలు – తోడు – దీవించుచు బ్రోచితివి – అటులే – ఈ వత్సరమందు – ఆశిస్సు – లందించి ఆనందింపగ – చేయుమయా ||దేవా||
2.
సంసార యాత్రలో – సంతాన ప్రాప్తిని – సకల – సంపద – లొసగితివి ఒసగి సంతోష – సౌఖ్యముల – సమకూర్చి – సతతంబు స్వామి – వీరల కొసగుమయా ||దేవా||
3.
సంకట – స్థితులందు – భంగ – పాటులయందు – బహు ధైర్య – ములనిచ్చితివి ఇచ్చి – నీ బాహు బంధముల – బంధించి రక్షించి – భోగ – భాగ్యము – లొసగితివి ||దేవా||
4.
ప్రేమాను – రాగముల – సిలువ వృక్షము – నందు – అంటు కట్టబడి వీరల్ తుదకు – ప్రేమ – బంధములతో – బంధింపబడి నీలో – బహుగా – ఫలియించునట్లు ||దేవా||
5.
ఆత్మీయ – శరీర – ఆకలి – దప్పుల – యందు – ఆదరణ – తృప్తి నొసగి ఆత్మ శక్తితో నింపి – నడిపించు – నీ త్రోవను – నిలిచి – నివసింపగ జేయన్ ||దేవా||
6.
ఇహ లోక – పరలోక – ఈవులన్నియు నిచ్చి – ఈ కవనును దీవించుము కడకు – కడు దీవెనలు – బొండ – కుటుంబ – సభ్యులమై – కృప చూపి – బ్రోవు మేసు ||దేవా||