#732పశ్చాత్తాపము
Author: రెవ. డాక్టర్. ఎన్. జాన్ ఎస్.డి. రాజుCategory: రెండవ అనుబంధము
ప
పశ్చాత్తాపము
యేసు ప్రభువా నన్ను గావు జీవదాయక నన్ను బ్రోవు (2)
మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని (2)
1.
కరుణ సాగర కరములెత్తి – కరుణ కొరకు కాచుకొంటిని (2)
మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని ||యేసు||
2.
సిలువ చెంత చేరితిప్పుడు – విలువ తెలిసి తిరిగి చేరితి (2)
మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని ||యేసు||
3.
పాప పంకిల భార బ్రతుకును – పారద్రోలి పవిత్రపరచు (2)
మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని ||యేసు||
4.
మధుర సేవ – నీదు సేవ జీవితాంతము చేసి తీరెద (2)
మనసా వాచా కర్మణా నీ సేవ చేసి తరించెద ||యేసు||
5.
నీదు సాక్షిగా నేను మార్గముగా – నీదు ప్రేమను పంచుము (2)
పరలోక నివాసమునకు – పరుగెడు నన్ను చేర్చుకొనుము ||యేసు||