FaithWalk
← Back to Library

#726జన్మదిన వార్షికము

Author: UnknownComposer/Ragam: రాగము : ముఖారి తాళం - త్రిపుటCategory: రెండవ అనుబంధము
ప
జన్మదిన వార్షికము సన్నుతింతును దేవా – నీ సన్నిధానమున – సన్నుతింపగ జాలన సకల మేలులు – సర్వ కృపలను – సిలువ విలువలు – ప్రేమ నొసగి – కలుషములు – కడుగంగ నాపై – కరుణచూపిన – కరుణామూర్తి
1.
గత కాలమందును – కాని చేతలు చేసి – మెెడలలో పడియుంటిని స్థితిని మరచి – నాదు మనవులు – మరల అడుగుచుండగ – మదిని రోయని నాదు పాపము – కడిగి శుద్ధుని చేసినందుకు ||నన్ను||
2.
పిండాకృతిలో నుండ – దండినాథుడవు – నాదు – గండములు – తొలగించితివి బండలాంటి బ్రతుకు బాటలో – గుండె బరువులు దించి అండగా – ఉండి నాబ్రతుకు – కొండ కుండగా – జీవజల బుగ్గలను ద్రాగుచు ||సన్ను||
3.
ఆయు – రారోగ్యములు – ఆనంద – సౌఖ్యములు – అనుగ్రహించిన నా విభుడు అనుక్షణంబు – అన్ని విధముల – ఆపదలు కలిగి నను ద్రోలి అండ – దండగ ఉండి నన్ను – ఆదరించిన దేవ సుతులు ||సన్ను||
4.
తల్లిదండ్రులు – అన్న – దమ్ములు – అక్కలు – చెల్లెండ్ర – తోబుట్టువులన్ ఎల్ల విధముల – కృపలొసగగ – ఉల్లాసింపగ – ఉర్వియందున – ఎల్లరికి – సువార్త – చాటుచు – యెలమి సాక్షిగ ఇలను నిలుపగ ||సన్ను||
5.
నూతన – వత్సరమందు – నీతి మార్గము విడువక – నీతి సూర్యుడ నడుపుమయా రోతవంటి – పాత బ్రతుకును పాప పాత వత్సరమందు వదలి నీతి – న్యాయము- కరుణ – శాంతులు – నూతననావలో – నొసగు తండ్రి ||సన్ను||
6.
జన్మనిచ్చిన తండ్రి – జన్మదినంబున – జన్మ జన్మకుల గావుమయా జవము జీవము – నవాలంబమును – పక్షిరాజున కొసగినట్లె మేమతో – హృదయమును – తృప్తితో – నింపి బ్రోవుము నీతో బ్రతుకుచు ||సన్ను||