←అన్ని కీర్తనలు · All SongsHymn #725 of 763
Font size:
725
పెండ్లి ప్రధానము
Pendli Pradhaanamu
పెండ్లి ప్రధానం
రాగము : జంఝూటి తాళం - ఆది · బోండ్ల సైమన్
Raagamu : Janjhooti Taalan - Aadi · Boandla Saiman
పల్లవి
పెండ్లి ప్రధానము
మానితమౌ – కార్యములను
– మాన్యుడేసే – చేయును
మానుగ వివాహ స్థితిని – మహిని సంకల్పించగ
చరణం 1
పెండ్లి – కార్యక్రమములలో – ప్రధానమే – ప్రధానము పెండ్లి – ఘనము – అన్నిటను – పాన్పు నిష్కళంకము ||మానిత||
చరణం 2
రిబ్కా మరియ కన్యకలకు – జరిగిన ప్రధానంబులు రమ్యముగాను – జరుగుచుండె – నాటినుండి – నేటికి ||మానిత||
చరణం 3
క్రీస్తు – వరుడు – సంఘ – వధువున్ – బెండ్లి – యాడ పరమున కల్వరిందు – సంఘమునకు – ప్రధానంబు – జరిగెను ||మానిత||
చరణం 4
వెండి బంగారు నగలు – వెలగల – వస్త్రంబులు పెండ్లికూతురాదులకు – నొసగనిత్తు – రీ దినం ||మానిత||
చరణం 5
తల్లికి – ముత్తైదువులకు – తగిన రీతి – ప్రేమతో తప్పక – వస్త్రములు – పెండ్లి కొడుకు – వారలిత్తురు ||మానిత||
చరణం 6
తండ్రి సుత – పరిశుద్ధాత్మ – త్రియేక దేవు స్తోత్రములు తరగనట్టి దీవెనలను – తండ్రిమరి – కొసగుమా ||మానిత||