#724నిశ్చితార్థము
Author: బోండ్ల సైమన్Category: రెండవ అనుబంధము
ప
నిశ్చితార్థం
రాగము : ఆనందభైరవి ఛాయ : కానాపురంబులో
కళ్యాణ – శోభతో – కలకాల – ప్రేమతో
కరుణాంత – రంగడు – కరుణచూపి కరుణాల – వాలుని
కమనీయ – సేవలు – కలవరము – లేకుండా – చేయు
మెప్పుడూ
1.
నిశ్చయ – తాంబూల – మిచ్చి పుచ్చుకొనుట – నిక్కమించు – ప్రభువు – నిర్ధారించె
నిశ్చయించిన యేసు నీడవలె వెంబడించి – నిరంతంబు – తోడుగ – నిలుచు –
మీదో ||కళ్యాణ||
2.
సంసార – జీవితము – సంగీత – కచేరి – సరిగాను – పదనిసల
సాకీలతో స్వరపేటికలు – రెండు – సప్తస్వరాలొకటిగా
సంసార – కచేరి సాగునటుల ||కళ్యాణ||
3.
అపభ్రశ్రు – తులు కలిగించు – అపస్వర రూపంబు – అప్పుడప్పుడు పలుకు – నా స్వర
రూపంబు అండగోరుము – యేసు – దండి పండిత – గురువు – గండములు
– తొలగించు గాత్రములకు ||కళ్యాణ||
4.
మధురాను – భూతుల – మధురిమల – హృద్వీణ – మృదుమధుర – రాగాలు మీటునటుల
తీగ తెగిపోకుండ తియ్యని అనురాగ – రాగములు – పాడగను – రయము మీర ||కళ్యాణ||
5.
తీగ తెగిపోయిన – తీగసరిచేయుట – మీ తరము
కాదని – యెరిగి యెప్పుడు తండ్రి సుత శుద్ధాత్మ – త్రియేక
దేవుడు – సరిచేసి – దీవించు – ధన్యులనగ ||కళ్యాణ||