#723శ్రీ యేసునాథ కథాక్రమము
Author: UnknownComposer/Ragam: (ఛాయ : ఎంతొ సుందరమైనవి ధరణిగిరులపై)Category: రెండవ అనుబంధము
ప
శ్రీ యేసునాథ కథాక్రమము
రాగము : కళ్యాణి తాళము : అట
శ్రీ యేసు చరితమిదియే స్నేహితులారా – చెలిమితో నాలింపరారే
ఇయ్యుర్విలో ప్రభువు – హితముగ జేసిన కార్యంబులన్నింటిని – క్రమముగా
దెలియరారే నాయము ఒప్పగ అనుదినంబును – నేర్చుకొనుచును అనుసరించిన
శ్రేయ మొసగును యేసు చరితము శ్రద్ధతో గమనింపరారే ||శ్రీ||
– స.సా. సుబ్బయ్య
1.
బయలుదేరెను దేవుడు – భూమికి తనను ప్రత్యక్షపరచుకొనెను జయముొప్ప
దూతలు – జగతికి వార్తలను – రయముగా దెచ్చిరి రాత్రి సమయమున
ప్రియముగా బెత్లేహేమందలి – పేద గొల్లలు పోయి చూచి – నయముగా
పూజించి హృదయాలు – ఆనంద మొందిరి – ప్రభుని జూసి ||శ్రీ యేసు||
2.
జ్ఞానులేగిరి యంతట ప్రభువగు శిశువునకు – కానుకలు పెట్టి బంగారు సాంబ్రాణి మొదలైనట్టి – కానుకల తో వారు – ఘన-మర్యాదలతోనూ – దీన బాలుని – చూడవచ్చిరి – దివ్యమగు – ఒంటెలను ఎక్కి – శ్రీసుతుని
సేవించి వెళ్ళిరి – శ్రీప్రభువుగా స్వస్థానములకు ||శ్రీ యేసు||
3.
హేరోదు చంపనెంచె – ఆ శిశువును రారాజు అని యెరుగక – కోరి
బెత్లేహేము చేరి రెండేండ్ల బాలుర నందరి సంహరించి
కడతేర్చె భూరి దేవుడు అద్భుతముగా – పారిపోయి ఐగుప్తునకు – క్రూర రాజు – మరణమొందగా –
చేరెను నజరేతు గ్రామము ||శ్రీ యేసు||
4.
మన దేవుడు భూమికి – వచ్చినప్పుడే – నన్ను పేరు పెట్టుకొనెను వినయముతో
ప్రభువు – వింత బాలునిగా పెరిగెను – ధరణిలో నజరేతు – తన
చిన్న గ్రామమున చనువుగా పస్కాకు వెళ్ళెను – సరిగా పన్నెండేండ్ల
వయస్సున – ఘనుల నడిగెను – ప్రశ్నలెన్నో
కడు విస్మయ మొంద వారులు ||శ్రీ యేసు||
5.
యొర్దాను నది యొద్దను స్నానము పొందె యుక్త వయస్సు – నందున శుద్ధ హృదయుడు పిదప, శోధనలో జయించి ఇద్దరిలో సేవ నింపు మీరగ జేయ బుద్ధి గల
శిష్యులను నలుగురిని – బేత్సయిదాలో పిలిచి వారితో – ఒద్దికతో కానాకు
వెళ్ళెను – ఒనరగ కళ్యాణమునకై శ్రీ యేసు ||
6.
ఇరువదియేడవ వర్షమున – పస్కా కొరకై యెరూషలేమునకు వెళ్ళెను పరి శ్రమ పరచెను – ప్రభువు దేవాలయమును – సరిగా తొమ్మిది నెలలు సదయ
డుక్కడ గడిపి – వెరువకను సమ – రయుల ప్రాంతము – కని సమరయ స్త్రీని కనుగొని – సరగ
గలిలయ కేగి ప్రభువు స్వస్థపరచె ప్రధాని కొమరుని ||శ్రీ యేసు||
7.
ఇరువది యెనిమిదవ యేటను – మార్చి నెలలో – యెరూషలేమునకు వెళ్ళెను
మరువక పూర్వము – మంచి పండుగ జరిపి – సరగ బేతెస్దలో – స్వస్థపరచి
రోగిని – తిరిగి నజరేతునకు బోయి – గురువుగా గ్రంథమును చదువ
పరిహసించిరి స్వంత వారలు – ప్రభువు ఇతడని తెలియ నేరక ||శ్రీ యేసు||
8.
ఆరంభించెను ప్రభువంత – సువార్త సంచారము
గలిలయలో నంత కోరిక
9.
కపెర్నహూం జేరి – తిబెరియ సరస్సు తీరమున శిష్యులన్ చేరబిలిచిన పిదప భూరి దయతో
కుష్ఠరోగిని బొలువు మీరగ పక్షవాయువు (4) – ఘోరముగా వ్యాధుల
లను మానిపి – మేర లేని కీర్తి నొందెను ||శ్రీ యేసు||
10.
రెండవ యాత్రను జేసెను యేసుడు తిరిగి – మండు వేసవి యందున దండి ప్రేమను తన పన్నెండు మంది నొక కొండ మీదను గూర్చి – గొప్ప బోధ
ను జేసి నిండు దయతో పిదప నధిపతి దండి దాసుని బాగుజేసి వండియును
నాయీను విధవకు – దండి మేలు నొసగి వచ్చెను ||శ్రీ యేసు||
11.
పిదప సీమోను ఇంట – యేసు ప్రభువు – ప్రియముగా భుజించెను సదయ
డు తిబెరియ – సరస్సు తీరమున కేగి – ముదముొప్ప నుపమానములు జెప్పి
బోధించి – పిదప సంద్రపు పొంగు నణచి – వదలగొట్టి సేన దయ్యము – తుదకు
యాయీరు – కుమారి తనను – ముదముతో బ్రతికించె ప్రభువు ||శ్రీ యేసు||
12.
మూడవ యాత్రను జేసెను – కపెర్నహూం వ – ముఖ్య స్థానముగా జేసి వేడుకన్
శిష్యులన్ వివిధ స్థలముల కంపించి – గోడు జెందక గొబ్బున నడవికి వెళ్ళెడు
ఐదు-వేల ప్రజలకు – నాడు రొట్టెలు పంచిపెట్టి – చూడ వింతగా
సముద్రముపై – గోడు జెందక నడిచి వెళ్ళెను ||శ్రీ యేసు||
13.
విరోధమెక్కువయై – యేసు ప్రభువని – వింత బోధలు వినగానే – పరలోకపు
రొట్టె ప్రభువు తానే యనగా – తర్కించ మొదలిడిరి తమలో
తామే జనులు మరియు పెద్దవాడుకలను – వెరువకను ఖండించగ సాగగా – యూదుల మనసున ద్వేషభావము – పెరిగెను కపెక్నహూమున ||శ్రీ యేసు||
14.
ఇరువదితొమ్మిదవ యేటను – ఏప్రిల్ నెలలో అరిగె నుత్తర దిక్కున – ధర తూరు సీదోను – సురోఫెనిక్య స్త్రీతోను – పరముడు మాట్లాడి – కరుణ చూపి వెనుక
తిరిగి వచ్చె దెకపొలిలో – జరిపి కొన్ని యద్భుతములను సరస్సు దరి
ని – నాలుగు వేలకు తిరిగి యాహారంబు పెట్టెను ||శ్రీ యేసు||
15.
కైసరియ ప్రాంతమున – యేసు ప్రభువు – తన శిష్యులతో వెళ్ళిన – ఆ సమయములోను –
యేసు మహాత్మ్యమున – భాసురంపు మహిమ ప్రత్యక్షపరచిన – దోసిలొగ్గి –
యేసు శిష్యులు – అసమాహాత్మ్యంబు కనుచు
ఆ స్థలమున చేరి నిత్యము – వాసమును జేయ జయమొంగ గోరిరి ||శ్రీ యేసు||
16.
తిరిగి వచ్చు వేళను – యేసుడు తన – మరణవార్తను జెప్పెను సరుగున తన ముఖ్య –
స్థానంబు చేరి – పరమ బోధలెన్నో విరివిగా జేసెను – ధరణును గొప్ప
తనము ఏదో – పరులు క్షమించుట యనకేమో – సరిగా జెప్పి గలిలయాను
స్వామి యేసు విడిచి వెళ్ళెను ||శ్రీ యేసు||
17.
యెరూషలేమున కేగెను – అక్టోబరులో పరిశుద్ధ పండుగకై – పరమ బోధలు జేసె – పర్ణ
శాలల నాడు – ధర జీవజాలమేదో – సరిగా వివరించెను మరియు లోకపు
వెలుగు ఏదో – పరమ స్వాతంత్ర్యము ఏదో గుర్తు
జెప్పగా – రాళ్ళనెత్తిరి – కరకు యూదులు మత్సరముచే ||శ్రీ యేసు||
18.
కడవరి సారి వెళ్ళెను – గలిలయాకు – గద్దించ ప్రియులిద్దరిన్ తడవు చేయక యే
సు – తన శిష్యులతో గూడి – కడు చేరువలో నున్న – ఘన పెరయాలో చేరి
పుడమిలో తన శిష్యులందరు – పూర్ణమనస్సుతో జేయు విధులను – కడు నెనరున
జెప్పి వారల – కభయ హస్తము నిచ్చి
పంపెను ||శ్రీ యేసు||
19.
యెరూషలేమున కేగెను మార్గములోనే మరియ మార్తల జూసెను సరుగన మార్గమునందు – స్వస్థ
పరచి యంధుని – పరిసయ్యులను వింత – పరచి బోధలు చేసి – వరుడు
ప్రతిష్ఠ పండుగ తరుణమున త – నెన్నెరుక – పరుగగా
అరులు తనను పట్ట జూడగా నందకుండా దాటిపోయెను ||శ్రీ యేసు||
20.
పెరయా పరిచర్య యందే – యేసు ప్రభువు పెక్కు బోధలు జేసెను పరిసయ్యులు జూడెడి –
పరిశుభ్రతను గూర్చి – ఇరుకు ద్వారము గూర్చి హితముగా బోధించి –
పరమ విందు దొరికెననియు – సిరిని గూర్చిన కథలు చెప్పి – సిరిని గూర్చిన
కథలు చెప్పి – ధరణును విశ్వాసమును పెంచెను – తగిన
బోధలెన్నెన్నో జేసెను ||శ్రీ యేసు||
21.
బేతనియకు వెళ్ళెను – యేసుడు పిదప బ్రతికించెను లాజరును ఖ్యాతిగ నెఫ్రాయీం – కుష్ఠ
రోగుల బ్రోచి – ప్రీతిగా న్యాయాధిపతి సుంకరి పరిసయ్యుల – సతీపతుల పరి
త్యాగము ధర చంటిపిల్లల నాశీర్వాదము – పేతురుకు ప్రత్యు
త్తరము అతి ప్రేమతో వివరించి చెప్పెను ||శ్రీ యేసు||
22.
జేసె యేసునాథుండు యెరూషలేము – చివరిగా ప్రయాణము వాసిగా
యెరికోకు – వచ్చి యంధుల బ్రోచి – జూసి జక్కయ్యను వాసిగా దర్శించి – యే
సు మీనా – లయము పదము చేసి తుదకు బేతనియలో
భాసురముగా మరియచే నభి
షేకమొందెను – మరణమునకై ||శ్రీ యేసు||
23.
ముప్పదవ సంవత్సరము – ఏప్రిల్ నెలలో గొప్ప పస్కా ముందుగా ఒప్పిదముగా వాహన
ము నెక్కి జయధ్వనులతో – గొప్ప సమూహముతో గొబ్బున నరిగెను చెప్పజాలని సం
తోషముతో – శిష్యులుండ యేసునాథుడు – గొప్ప చింతలో మునిగె
నా పురి – ముప్పు నొందును సరిగా ననుచును ||శ్రీ యేసు||
24.
సోమవారము రోజున – యేసు ప్రభువు – శపించె నొక్క చెట్టును స్వామి ఆ దినమున – సరిగా
గుడికి వెళ్ళి – పామరులందరి పారదోలిన వెనుక ప్రేమతో రోగులను స్వ
స్థపరచి మటంచు బోధలు చేయ నరులు – తామసముతో నిండుకొనుచు – ఏమి
జేతుమటంచు సణిగిరి ||శ్రీ యేసు||
25.
మంగళవారము – చెట్టును యేసు మరల జేవి – చారము సంగతి తెలియక
శాస్త్రులు ప్రశ్న ప్రసంగములతో ప్రభుని భంగ పరచ జూడ రంగము మీరగ మూడు
ప్రశ్నలు – రయముగా నుపమానములతో భంగపరచెను వారి
యుక్తులను – ప్రభువు పరిసయ్యులను జూచి ||శ్రీ యేసు||
26.
మోదమొందెను యేసుడు చందా వేయు – బీద విధవను జూసెను ఆదరిం
చెను ప్రభువు మేదిని హెల్లేనీయులను – యూదజనులంత
విరోధించగా ప్రభుని బోధపరచెను యెరూషలేము – మేదిని నాశన
మగునని – ప్రోదిగా లోకాంత వార్తలు – ఆ దినముననే చెప్పి వేసెను ||శ్రీ యేసు||
27.
బుధవారము రోజున – శిష్యుల తోడ – పూర్ణ విశ్రాంతి నొందె – సదయడు తన
గురువారము సంస్కారమును ఇచ్చి – పదిలంబుగా యేసు పరమ బోధలు
జేసెన్ – ముదముతో తన ప్రియుల కొరకై – ముఖ్యముగా ప్రార్థించి పిదప సదయడే
సుడు గెత్సేమందున – శత్రువుల చే పట్టు వడియె ||శ్రీ యేసు||
28.
శుక్రవారము నందున యేసు ప్రభువు – పెక్కు శ్రమల నొందెను – అక్ర
మముగ యూదు – లన్యాయ నేరముల్ – పెక్కు మోపికడకు – పెద్ద
నేరస్థుడని మిక్కుటంపు నీచమైన మ్రానును వ్రేలాడదీసి – పెక్కు బాధలు పెట్టి చంపిరి
ప్రక్కలో బల్లంబు గుచ్చిరి ||శ్రీ యేసు||
29.
శనివారము రోజున – యేసు దేహము – సమాధిలో నుండెను – ఘ
నుడు ఆదివార – మాన సమాధిని విడచే – తనకు తానే చూపించి ఇరుపొస
కొన వచ్చె – తన ప్రియులకు అప్పుడప్పుడు కనబడుచు యాదరణ నిచ్చెను –
పునరుత్థానుడు యేసు నలుబది – దినములకు – పరమందున నిలిచెన్ ||శ్రీ యేసు||
30.
మగ్దలేనే మరియకు – మొదటనే యేసు – మరువక కనబడెను – ఇద్ద
రిలో ప్రభువు – ఇతర స్త్రీలకు పిదప – అదినమందున నెమ్మాయు శి
ష్యులకును బుద్ధి తెలిసిన పేతురుకు పరి – శుద్ధ తోమా ఇతర శిష్యుల యొద్ద
లేనప్పుడు ఉన్నప్పుడును ఒద్దికతో కనబడెను ప్రభువు ||శ్రీ యేసు||
31.
గలిలయలో కనబడెను – ఏడుగురికి – ఘన తిబెరియ సరస్సు యొద్ద – తలచియే ||శ్రీ యేసు||
32.
బేతనియకు వెళ్ళెను కడవరి సారి – ప్రియ శిష్యులతోడను – ప్రీతిగ వారితో – ప్రియ
మొప్ప మాట్లాడి – చేతులెత్తి యంతనా – శీర్వదించుచు వారిని
భూతలంబును విడిచి యేసు – ఖ్యాతిగ పైకెక్కి పోవగ – దూతలిద్దరు వచ్చి
చెప్పిరి దుఃఖపడవద్దంచు వారిని ||శ్రీ యేసు||
33.
పరలోకమున నున్నాడు – ఇప్పుడు మనకై – ప్రార్థన
సరిగా చేయును త్వరలో – మురుపుగా తన భక్తులందరి పరమునకు గొనిపో
సరుగన – పరమదూతలు పరివృతుడై – అరుగుచు
న్నాడదియు వినుడి ||శ్రీ యేసు||
34.
ధరలో యేసును నమ్మండి – త్రిత్వము పేర – వర బాప్తిస్మము నొందండి సరిగ మీరు
క్రీస్తు సంఘము నందున జేరి – పరిశుద్ధ వర్తనతో అరమరలేకను తిరిగి –
చిరసుఖములను బొందరండి – పరమ కరుణా – కరుడు యేసుడు
ధర పరములందతడు మనకాదరణ చూపు దండి దేవుడు ||శ్రీ యేసు||