#722యువజన సంఘ భజన కీర్తనలు
Author: స.సా. సుబ్బయ్యComposer/Ragam: (ఛాయ : స్తోత్రము చేయరే - సోదరులారా)Category: రెండవ అనుబంధము
ప
యౌవనస్థుల భజన కీర్తనలు
వలయాకారముగా నిలువబడి అభినయము చేయుచు పాడవలెను
రమ్ము రమ్ము ఓ పరిశుద్ధాత్మా – మమ్ములను మరువకను – ఇమ్మహిలో మా తోడు నీవు యని – హితముగా వేడుదును
1.
దోసిలొగ్గి నిన్ను వేడుచుండగా – యేసు నామమునను – నీ శుభములకై కాచియుండగా – దాసుల మొర వినుము
2.
శిరములు వంచి కరములు మోడ్చి – మొరలు పెట్టగానూ – పరమ వరములను – కుర కుర మాపై – గురియింపుమికను
3.
మోకరించి నిన్ను వేడుచుండగా – మోదము చూపుచునూ – నీకై మ్రొక్కుచు బ్రతిమిలాడగా – ఏకమనస్సుతోనూ ||
4.
యేసు నామమున లేచి నిలబడి – ఎంచుచు మేలులను – వాసిగ భజనలు చేసి నుతింతుము – నీ సహాయమునను