#719యేసుని భజియింపవే మనసా
Author: ఆచార్య ఆర్.ఆర్.మూర్తిCategory: రెండవ అనుబంధము
ప
యేసుని భజియింపవే మనసా భాసమాన తేజస్సు – ఘన
రక్షకుని ||యేసుని||
1.
తకజను తకజను దివ్య మృదంగ తకధిమి తకధిమి యని తాళము వేయుచు ||యేసుని||
2.
బిలహరి సారమతి కాంభోజి – బృందావన సారంగ కాదంబము – రాగస్వర రంజితమై –
ఆ ...ఆ దేవుని రాజ్యము కరుణామృతమొలుకగా ||యేసుని||
3.
రాగం తానం పల్లవి రస మాధురి సుమ వల్లరి – యేసు పద పద్మములపై కులపోసి తలపోసి తరియించుము ||యేసుని||