#720వచ్చి చూడుడి
Author: స.సా. సుబ్బయ్యComposer/Ragam: (ఛాయ: పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా)Category: రెండవ అనుబంధము
ప
వచ్చిచూడండి
వచ్చి చూడుము అన్నా – పరమ క్రీస్తు నిప్పుడే – హెచ్చైన శుభములు ఇచ్చునదితడే
1.
యేసే మన రక్షకుడు – యేసే దేవుడు – వాసిగ రక్షింప వచ్చినాడిలకు
2.
మనలను రక్షింప – మరణంబు నొంది – తనకు తాను లేచి ఘనుడయ్యెను యేసు
3.
మేము చూస్తిమి ఆ స్వామిని నిజము – ప్రేమగలవాడతడు ఈ మాట వినుము
4.
ఇహమున కనలేము – ఇట్టి రక్షకుని బహు మంచివాడతడు ప్రభువైన క్రీస్తు
5.
ఇతడే మన దేవుడు వినుము ఓ యన్నా ఖ్యాతి లోను మనకు సద్గతి ఇతడే యన్నా