#711బ్యూలా దేశము నాది
Author: ఆచార్య ఆర్.ఆర్.మూర్తిCategory: రెండవ అనుబంధము
ప
బేయులా దేశము నాది సుస్థిరమైన పునాది –
కాలము స్థలము లేనిది సుందర పురము – నందనవనము ||బేయులా||
1.
స్పటికనది తీరము నాది అన్నింటిలో ఘనము అనాది – అపశృతి లేని రాగములు అలరెడి పురము యేసుని వరము ||బేయులా||
2.
జీవ వృక్షఫల సాయము నాది దేవుని మహిమ స్పర్శవేది – మరణము బాధలేనిది
– అమరుల పురము మంగళకరము ||బేయులా||