#703యువజనులకు పిలుపు
Author: రెవ. కొంగర సామ్యేల్ సంజీవిComposer/Ragam: ఛాయ: ఉదయమాయెననుCategory: రెండవ అనుబంధము
ప
యువజనులకు పిలుపు
యువజనులంతా – యేసుని పేరిట – ఏకము కావలెను భువిలో
యేసుని – ప్రేమను చాటను – బూని కదలవలెను ||యువ||
1.
యేసే మాదిరి – యేసే రక్షకుడు – యేసే దేవుడని వాసిగా యేసుని జాడలో
నడువగ నాశతో బూనుదము ||యువ||
2.
ప్రార్థన జేతుము – ప్రతి దినమును మన పరమ తండ్రికి ఇలలో సార్థకముగా
సహవాస తండ్రితో – సతతము చేయుదము ||యువ||
3.
దేవుని వాక్యము త్రోవకు వెలుగది – భావము మార్చునని జీవము నొందగా
దినదినమున నొక భాగము చదువుదము ||యువ||
4.
సంఘము యేసుని శరీరమేయని – సేవకు బూనుదము సంఘపు క్షేమమే
మదిలో నిడుకొని – సాయము చేయుదము ||యువ||
5.
సేవను చేసి సాక్ష్యము నిచ్చి – యేసుని చూపుదాము ఏ విధముననో యేసుని యొద్దకు
ఆత్మల నడుపుదాము ||యువ||