#702లేమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియు
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
క్రైస్తవ సంఘమా! లేమ్ము తేజరిల్లుము!!
లేమ్ము తేజరిల్లుము
నీకు – వెలుగు వచ్చియున్నది యేసుని మహిమ నీపై – ప్రకాశముగ
నుదయించె ||లేమ్ము||
1.
యేసే ఈ లోకమునకు – వెలుగైయు
న్నానని చెప్పెన్ యేసుని నమ్మువారు – వెలుగులో నడుచువారు ||లేమ్ము||
2.
అంధకారమందుండి – బంధింపబడినవారిన్
ఆశ్చర్యమైన వెలుగు – నందించి విమోచించెన్ ||లేమ్ము||
3.
దాత ప్రభు యేసుని నమ్మి – నీతిగా
నడుచువారు జాతి భేదములు లేక – జ్యోతుల వలెనుందురు ||లేమ్ము||
4.
మనుజులు మీ సత్క్రియలను – చూసి బహు సంతోషించి
మనసార పరమ తండ్రిని – మహిమ పరచెదరు ||లేమ్ము||
5.
జనములు నీ వెలుగునకు పరుగెత్తి వచ్చెదరు రాజులు నీదు ఉదయకాంతికి
వచ్చెదరు ||లేమ్ము||