FaithWalk
Font size:
701

క్రీస్తు అవతారము కొరకు స్తోత్రము

Kreestu Avataaramu Koraku Stoatramu

స్తోత్రము చేయుదుము పాత్రుడవు నీవే రాత్రి


రెవ. కొంగర సామ్యేల్ సంజీవి

Reva. Kongara Saamyael Sanjeevi

పల్లవి

క్రీస్తు అవతారము కొరకు స్తోత్రము స్తోత్రము జేతుము పాత్రుడ నీవే రాత్రిలో మా ప్రియ తండ్రి స్తోత్రములివే గొనుమా మా స్తోత్రములివే గొనుమా ||స్తోత్రము||

చరణం 1

లోకమునెంతో ప్రేమించి – ప్రాకటముగా రక్షింపగా క్రీస్తును – ఇల మా కొర కిచ్చినందుకై ||స్తోత్రము||

చరణం 2

ధనవంతుడగు మా ప్రభువు ధనికులుగా మము చేయను దీనుడుగా ఇల అవతరించి బహు ధన్యులుగా మము చేసినందుకై ||స్తోత్రము||

చరణం 3

పాపులమగు మము ప్రేమించి – పాపము పరిహరింపగా తాపమెంచక సిలువ నొంది నీ దాపుకు మమ్మును చేర్చినందుకై ||స్తోత్రము||

చరణం 4

ఒప్పగు క్రిస్మసు నందున మెప్పగు మా కొర కిచ్చిన చెప్ప శక్యము గాని వరముకై గొప్పగా మా స్తుతులందుకొనుము జై ||స్తోత్రము||