FaithWalk
Font size:
700

దేవుడు లోకమును నెంతో ప్రేమించెను

Daevudu Loakamunu Nentoa Praeminchenu

దేవుడు లోకమును నెంతో ప్రేమించెను పల్లవి: దానమిచ్చెను ధరణికి దేవుడు ప్రేమతో తన ప్రియ తనయున్ లోకమునెంతో ప్రేమించెన్ - కుమారునియందు విశ్వసించువారిని రక్షింపగనెంచి ॥దానమిచ్చెను॥


రెవ. కొంగర సామ్యేల్ సంజీవి

Reva. Kongara Saamyael Sanjeevi

పల్లవి

దేవుడు లోకమును నెంతో ప్రేమించెను దానమిచ్చెను ధరణికి దేవుడు ప్రేమతో తన ప్రియ తనయున్ లోకమునెంతో ప్రేమించెన్ – కుమారునియందు విశ్వసించు వారిని రక్షింపగ నెంచి ||దానమిచ్చెను||

చరణం 1

దూతలు అర్ధరాత్రియందున – ఖ్యాతిగా శుభవార్త దెలిపిరి బెత్లహేము పట్టణమందున ప్రభుయేసు పుట్టెను రక్షకుడాయన – రయమున జూడుడి ||దానమిచ్చెను||

చరణం 2

ప్రాణమియ్యను పాపుల కొరకై – ప్రేమతో ప్రభుయేసు వచ్చెను దేవుని మహిమను విడిచి – మానవుడయ్యెను మనవంటివాడుగా – మహిలోన పుట్టెను ||దాన||

చరణం 3

చేర్చుకొనుడి మీ హృదయములలో – ప్రీతితో ప్రభు యేసు రక్షకుని పాపికి పరిహారము మరియు – పరిశుద్ధ జీవితం పరలోక ఆనందం – ప్రభుయేసుడిచ్చును ||దానమిచ్చెను||

చరణం 4

హల్లెలూయా పాడుదాము – దేవుని అమూల్య ప్రేమకై యేసు మనకిచ్చి నందుకై మన రక్షణ కొరకై హొసన్న పాడుదాం ||దాన||