#699రాగము - ద్విజావంతి జయజయవంతి మిశ్రము తాళమ
Author: సాల్మన్ రాజుCategory: రెండవ అనుబంధము
ప
రాగము - ద్విజావంతి జయ జయ వంతి మిశ్రము తాళము - ఆది
యేసు నామమే పావనము – ప్రభు
యేసే రక్షణ కారణము – మను
జాళి పాపము తీరగా – మరణాబ్ది తీరము చేరగా – శ్రీ
యేసు మాకు దారిగదా
1.
స్వామి యేసు మాలో – తన ప్రేమ నిలుపగా – యెనలేని దీవిగా – తన
మేను బలినివ్వలేదా ||యేసు||
2.
పాప ఘోర తాప – తతి బాపి కరుణతో – చెయ్యి
జాపి ప్రేమచే – తన ప్రాపు
మనకిడలేదా ||యేసు||
3.
రక్త సిక్త బాట – మన
ముక్తి పదముగా – అను
రక్తి చూపుగా – మన
పాలి రక్షకుడాయెగదా ||యేసు||
4.
చావు గెలిచి మాకు – తన జీవమొసగగా – మము
కాయువాడుగా – ఘన
దేవుడితడగు గాదా ||యేసు||
5.
దారి కానరాని – కడు ఘోర వనములో – నడి
యాదువేళలో మము
చేరబిలిచిన వాడుగదా ||యేసు||
6.
ఎన్నరాని రేడు – మము
కన్న సుతులుగా – చే
కొన్నవాడుగా తన
పేరు
మనకిడిలేదా ||యేసు||
7.
నేడు యేసు రాజు – మన తోడు నడువగా – కొని
యాడి వేడుచు – కవి
సీమ నిలుతుము వేగ ||యేసు||