FaithWalk
← Back to Library

#698మధుర మధుర మధురసేవ – యేసు ప్రభు సేవ

Author: ఎ.బి.మాసిలామణిCategory: రెండవ అనుబంధము
ప
రా.. తిలకమోద తా–ఆది మధుర మధుర మధుర సేవ – యేసు ప్రభు సేవ
1.
దేవదూతకును లేని దైవజనుని సేవ – దేవసుతుని సంఘ సేవ దివ్యమౌ సువార్త సేవ ||మధుర||
2.
పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజలు వర్ధిల్లు సేవ – పరిమళించు వాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవ ||మధుర||
3.
प्रभुని పేర ప్రజల యెదుట ప్రవచనాల సేవ – ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్థనలు అర్చించు సేవ ||మధుర||
4.
భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ – బాష్పసిరులలోన మెలగి బాధలను వరించు సేవ ||మధుర||
5.
సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవ – సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ ||మధుర||
6.
లోకజ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ – లోకులను దీవించు సేవ లోకమును జయించు సేవ ||మధుర||
7.
దైవజనుడా మరవకోయి దైవపిలుపునోయి – దైవనీతి వదలకోయి దేవుడు దీవించునోయి ||మధుర||