#697అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతా
Author: ఎ.బి.మాసిలామణిCategory: రెండవ అనుబంధము
1.
అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్రముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల||
2.
విశ్వాసయాత్ర దూరమెంతైనా – విందుగా దోచెను వింతైనా
శాంతి వర్షించె నాలో – విజయపథమున
విశ్వాసలేని దేవుని కుమారుని – వీక్షించు దీక్షతో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల||
3.
యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి
తప్పిన వేళ యెదలో కృంగితి
యేసయ్యతార యెప్పటివోలె యెదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయమొందుచు యేగితి స్వామి కడకు ||అందాల||
4.
ప్రభు జన్మస్థలము పాకయేగాని – పరలోక సౌధమే
బాలుని చూడ జీవితమంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగ ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలించె ప్రార్థన ||అందాల||